- వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : సృజనాత్మక శక్తి పెరుగుదలకు,మానసిక వికాసానికి క్రీడలు ప్రధానమని తెయూ వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు అన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో యాన్యువల్ డే 2025 స్పోర్ట్స్ మీట్ ను ఆచార్య టి.యాదగిరిరావు విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో బుధవారం ప్రారంభించారు. ఈ క్రీడలు 19 మార్చి నుండి 29 వరకు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా వైస్- ఛాన్స్లర్ ఆచార్య టీ. యాదగిరిరావు మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులకు విశ్వవిద్యాలయంలో వాలీబాల్, ఖో ఖో, కబడ్డీ, క్రికెట్, బ్యాట్మెంటన్ క్రీడలు బాలురకు బాలికలకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థినీ విద్యార్థులు చదువుతోపాటు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కళాశాల అధ్యాపకులకు వాలీబాల్, క్రికెట్ పోటీలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. చదువుతోపాటు విద్యార్థి జీవితంలో సృజనాత్మక శక్తి పెరుగుదలకు మానసిక వికాసానికి క్రీడలు దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి తన అంతర్గత సృజనాత్మక శక్తిని ప్రదర్శించాలని తెలిపారు. గెలుపు ఓటమిలు సహజమని, సమానమని విద్యార్థులు క్రీడల ద్వారా అలవర్చుకోవాలన్నారు. క్రీడల ద్వారా మంచి స్నేహ సంబంధాలు ఏర్పరచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మామిడాల ప్రవీణ్, డైరెక్టర్ పబ్లిక్ రిలేషన్ ఆఫీస్ డాక్టర్ ఏ పున్నయ్య పాల్గొన్నారు.
1258
