29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : మోస్రా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1996-97 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని నిఖిల్ సాయి హోటల్ లో పూర్వ విద్యార్థులందరూ ఒక్క చోట  కలుసుకున్నారు. ఆనాటి చదువు చెప్పిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు. మండల విద్యాధికారి నాగయ్య మాట్లాడుతూ 28 సంవత్సరాల తర్వాత అందరూ ఒకే వేదికపై కలుసుకుని వేడుక  నిర్వహించుకుని, చదువు చెప్పిన విద్యార్థులను సన్మానించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు విద్యాబుద్దులు నేర్పిన ఉపాధ్యాయుల వల్లనే తాము ఉన్నత స్థాయిలో ఉన్నామని, తమ ఎదుగుదలకు కారణమని చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మహేశ్వర్ రెడ్డి, గంగారెడ్డి, గణేష్, లక్ష్మణ్. మొగులయ్య, శంకర్ గౌడ్, వెంకటరెడ్డి, రవీందర్, స్వప్న, సుధాకర్ రెడ్డి, కవిత, సంగీత పాల్గొన్నారు.

More articles

Latest article