పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నిజామాబాద్ సిటి, బతుకమ్మ : మోస్రా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1996-97 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని నిఖిల్ సాయి హోటల్ లో పూర్వ విద్యార్థులందరూ ఒక్క చోట కలుసుకున్నారు. ఆనాటి చదువు చెప్పిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు. మండల విద్యాధికారి నాగయ్య మాట్లాడుతూ 28 సంవత్సరాల తర్వాత అందరూ ఒకే వేదికపై కలుసుకుని వేడుక నిర్వహించుకుని, చదువు చెప్పిన విద్యార్థులను సన్మానించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు విద్యాబుద్దులు నేర్పిన...