23.5 C
Hyderabad

తమిళనాడులో సంచలనం

A sensation in Tamil Nadu

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  తేని సబ్ జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్!

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

తమిళనాడులోని తేని జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. తేని సబ్ జైలు నుంచి ఏకంగా 17 మంది ఖైదీలు పరారయ్యారు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరగడంతో జైలు శాఖలో కలకలం రేగింది. తేని నుంచి దిండిగల్ వరకు పోలీసులు హైఅలర్ట్ ప్రకటించి, గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దాదాపు 16 ప్రదేశాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. ఒకే సెల్‌లో ఉన్న కొందరు ఖైదీలు పక్కా ప్లాన్‌తో ఈ పరారీకి తెరతీశారు. ఒక ఖైదీకి మూర్ఛ వచ్చినట్లు మిగిలిన వారు నాటకమాడారు. దీంతో సిబ్బంది సెల్ తలుపు తెరిచి లోపలికి రాగానే, వారిపై దాడి చేసి బయటకు పరుగులు తీశారు. దాడిలో గాయపడిన సిబ్బందిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరారైన ఖైదీలు జైలు వెనుక ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. అటవీ ప్రాంతంలో ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పరారైన 17 మందిలో నలుగురిని పోలీసులు తిరిగి అరెస్ట్ చేయగా మిగిలిన 14 మంది కోసం వేట కొనసాగుతోంది.

More articles

Latest article