23.5 C
Hyderabad

రైల్వే జీఎం కార్యాలయం ఎదుట కాంగ్రెస్ మెరుపు ధర్నా

Congress stages a flash protest in front of the Railway GM's office

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఢిల్లీ నిరసనకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై ఆగ్రహం

 

. . . కాంగ్రెస్ నేతల అరెస్ట్

 

హైదరాబాద్‌, బతుకమ్మ :

 

నవంబర్ 1న  ఢిల్లీలో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక రైళ్లు కేటాయించాలని కోరినా దక్షిణ మధ్య రైల్వే నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో కాంగ్రెస్ నాయకులు బుధవారం ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట మెరుపు ధర్నా నిర్వహించారు.

Congress stages a flash protest in front of the Railway GM's office

అనంతరం రైల్వే స్టేషన్ వద్ద ధర్నా కొనసాగించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లేందుకు వీలుగా హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకులు రైల్వే శాఖను కోరారు. అయితే ప్రత్యేక రైళ్ల కేటాయింపు విషయంలో అనుకూల స్పందన రాకపోవడంతో రైల్వే జీఎం కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, గణేశ్, ఎంపీ రఘురామ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు మోత రోహిత్, దీపక్ జాన్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.

Congress stages a flash protest in front of the Railway GM's office
 

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీలో జరిగే పార్టీ నిరసన కార్యక్రమానికి రైళ్లు కేటాయించకుండా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రైల్వే స్టేషన్ వద్ద కూడా కాంగ్రెస్ నాయకులు మెరుపు ధర్నా కొనసాగించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, గణేశ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Congress stages a flash protest in front of the Railway GM's office
 

More articles

Latest article