29.3 C
Hyderabad

మహిళలు ఆర్థికంగా ఎదుగాలి

Women should progress economically.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క

 

సదాశివనగర్, బతుకమ్మ :

 

మహిళలు సామాజికంగా, ఆర్థికంగా ఎదుగాలని అప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుందని భవనాన్ని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సీతక్క అన్నారు. రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన మహిళా సమాఖ్య భవనాన్ని సీతక్క, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ తో కలిసి ప్రారంభించారు. గతంలో పోసానిపేట్ గ్రామానికి చెందిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తమ సంఘ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి ప్రత్యేక భవనం అవసరమని ఎమ్మెల్యే మదన్ మోహన్ ని కలిసి విజ్ఞప్తి చేశారు. మహిళల అవసరాన్ని గుర్తించిన ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామానికి విచ్చేసిన మంత్రి సీతక్క కి, ఎమ్మెల్యే మదన్ మోహన్ కి మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యేకు మహిళా సంఘాల సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా నిర్మించిన ఈ భవనం మహిళా సంఘాల సభ్యులకు సమావేశాలు నిర్వహించుకోవడానికి, పొదుపు కార్యకలాపాలు చేపట్టడానికి, సంఘాల ద్వారా అమలయ్యే కార్యక్రమాలను సమర్థవంతంగా కొనసాగించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడనుందన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ, స్వయం సమృద్ధి సాధించడంలో స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

More articles

Latest article