30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఏ.ప్రమీల ఎంపిక

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా అడ్లూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటి గా పని చేస్తున్న ఏ. ప్రమీల జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. సంబంధిత విషయం బోధనలో విద్యార్థులకు తనదైన శైలిలో ఆధునిక బోధన తో వినూత్నంగా చిత్రపటాలు తయారుచేసి విద్యార్థులకు ఆకట్టుకునే విధంగా గుర్తుండే విధంగా బోధిస్తున్నారు. చిన్నపిల్లలకు చదువును ఆటపాటల రూపంలో సులభంగా, అర్థమయ్యే విధంగా బోధిస్తున్నారు. అందరికీ ఉపయోగపడే విధంగా సామాజిక మాధ్యమాలో కూడా పరిచారు. జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనటువంటి ఉపాధ్యాయురాలు ఏ. ప్రమీల కు విద్యాధికారులు, తోటి ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శుభాకాంక్షలు తెలిపారు.

More articles

Latest article