- టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్, బతుకమ్మ : మున్నూరు కాపు బిడ్డ అని చెప్పుకునే బండి సంజయ్ బీసీల ద్రోహిలా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. నిజామాబాద్ లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఆయన బిసి కాదు దేశ్ ముఖ్.. దమ్ముంటే బండి సంజయ్ సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. మోడీ ని అడ్డుపెట్టుకుని ఇపుడు తాత్కాలికంగా బిసి రిజర్వేషన్ ను ఆపుతున్నారన్నారు. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవటం ఖాయమని, అపుడు బిసి రిజర్వేషన్ ఎలా ఆపుతారో చూస్తామని అన్నారు. బీసీ పౌరుషం ఉంటే బిసి బిల్లును చట్టబద్ధత చెయ్యి అని బండి సంజయ్ కి ఛాలెంజ్ చేశారు. కవిత ను జిల్లా కోడలుగా అభిమానిస్తాం.. లిక్కర్ రాణిగా ద్వేషిస్తామమని అన్నారు. కాళేశ్వరం అవినీతి జరిగింది అనటానికి కవిత మాటలు నిదర్శనమని తెలిపారు. కుటుంబ సభ్యులంతా కలిసి దోచుకున్నామని చెప్పారు. వాటాల్లో తేడా వల్ల విభేదాలు భగ్గుమన్నాయన్నారు. బి ఆర్ ఎస్ అధికారంలో ఉన్నపుడు కవిత ఈ మాట చెప్పి ఉంటే సన్మానం చేసేవాళ్ళమని తెలిపారు. కవిత తో కెసిఆర్ డ్రామా ఆడిస్తున్నారని అనుమానం కలుగుతుందన్నారు. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో బి ఆర్ ఎస్ ఉండదని ఏడాది క్రితం చెప్పాను,అదే జరుగుతుందని పేర్కొన్నారు.
