27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

యువకుడి దారుణ హత్య

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ : నగర శివారులోని హైదరాబాద్ రోడ్ లో గల పాంగ్రా వద్ద  యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. సుమారు 30 సంవత్సరాల వయస్సు గల యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు ముఖంపై బలమైన ఆయుధంతో కొట్టి హత్య చేసినట్టు ఆనవాళ్లు ఉన్నాయి . ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారంతో నగర పోలీసులు అక్కడ చేరుకొని దర్యాప్తు చేపట్టారు. యువకుడి వివరాలు తెలిస్తే గాని హత్యగల కారణాలు తెలిసే అవకాశం లేదని పోలీసులు తెలిపారు. ఘటన స్థలాన్ని నిజామాబాద్ నగర సీఐ శ్రీనివాసరాజు, 4వ  టౌన్ ఎస్ఐ  శ్రీకాంత్ లు పరిశీలించారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పాంగ్ర వద్ద గల కల్లుబట్టిలో  సోమవారం రాత్రి ఏమైనా గొడవ జరిగి ఉంటుందా అని ఆరా తీస్తున్నారు.

More articles

Latest article