- ఎర్రవల్లి ఫాంహౌజ్ కు గేట్ల మూసివేత
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ పార్టీ చెక్ పెట్టిందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. గత 11 సంవత్సరాలుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత ఆప్తుడిగా ఒక వెలుగు వెలిగిన మాజీ ఎమ్మెల్యేకు ఎర్రవల్లి ఫాంహౌజ్ కు నో ఎంట్రీ అని వినబడుతుంది. ఇటీవల కాలంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో తరుచూ వివాదాల్లో నిలుస్తూ భూ కబ్జాలు, దందాలు, సెటిల్ మెంట్లకు మారుపేరుగా నిలిచిన ఆ మాజీ ఎమ్మెల్యే తీరుతో పార్టీ గౌరవ మర్యాదలకు చెడ్డపేరు వచ్చిందనే టాక్ నడుస్తోంది. ఆయన సొంత నియోజకవర్గంలోనే పార్టీ సీనియర్లతో విభేదాలతో గడిచిన ఎన్నికల్లో ఘోర పరాభావాన్ని మూటగట్టుకున్న పనితీరు మార్చుకోకపోవడమే కారణమనే చర్చ జరుగుతుంది. ఇటీవల కాలంలో ఆయన సొంత నియోజకవర్గంలో నేతలే నియోజకవర్గ ఇంచార్జిని మార్చాలనే డిమాండ్ ను తెరపైకి తేవడం బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతుంది. ఇటీవల కాలంలో ఫాంహౌజ్ లో ఇతర సందర్భాలలో పార్టీలో అంతర్గతంగా చర్చించుకునే విషయాలు గుట్టుచప్పుడు కాకుండా అధికార పార్టీకి చేరవేయడంలో మాజీ ఎమ్మెల్యే ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని గుర్తించిన అధినేత మాజీ ఎమ్మెల్యేను గెట్ ఔట్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. అటు నియోజకవర్గంలో ఓడిపోయి ఇటు పార్టీలోనూ పరువు తీస్తున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని పార్టీలో పిచ్చపాటిగా చర్చించుకుంటున్నారు. ఊ అంటే ప్రెస్ మీట్ లు పెట్టి ప్రతిపక్ష పార్టీలపై దుమ్మెత్తిపోసిని మాజీ ఎమ్మెల్యేను సొంత పార్టీ నాయకులే ఈసడించుకోవడంతో భవిష్యత్తు ఏంటనే చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరికి వినకుండా తనదైన ఏజండాతో గెలిస్తే మంత్రినని పలువురిని బెదిరించిన మాజీ ఎమ్మెల్యేకు సొంత పార్టీలోనే ఎంట్రీకి రెడ్ కార్డు పడడం జిల్లాలో జోరుగా చర్చ జరుగుతుంది.
