25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

అతి భారీ వర్షాల హెచ్చరిక

Must read

📰 Generate e-Paper Clip

  • జూలై 6, 9న భారీ వర్షాలు

 

హైదరాబాద్, బతుకమ్మ : ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా  జూలై 6, 9 తేదీలలో, తాజాగా ఏర్పడిన అల్పపీడనం కారణంగా గులాబీ, ఎరుపు రంగులో గుర్తించబడిన జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.  జూలై 7-8 తేదీలలో గరిష్ట ప్రభావం ఉంటుంది. గులాబి ప్రాంతాలలో కొన్ని చోట్ల 150-220 మి.మీ అతి భారీ వర్షాలు కురుస్తాయి, దీనివల్ల వరదలు సంభవిస్తాయని తెలిపింది. నీలం రంగులో గుర్తించబడిన ఇతర జిల్లాల్లో ముసురుతో కూడిన మోస్తరు వర్షాలు, ఆకుపచ్చ రంగులో గుర్తించబడిన జిల్లాల్లో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఆదివారం సాయంత్రం అక్కడక్కడ స్వల్పకాలిక వర్షాలు, జూలై 7-8 తేదీలలో ముసురుతో కూడిన తేలికపాటి, మోస్తారు వర్షాలు కురుస్తాయి.

More articles

Latest article