25.5 C
Hyderabad

గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలిసులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలోని  నాగరం లొ గంజాయి అమ్ముతున్నారు అనే  విశ్వసనీయ సమాచారం మేరకు  ఎక్సైజ్ ఎస్ హెచ్ఓ దిలిప్ అధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. నాగారం చౌరస్తా దగ్గర లోని హనుమాన్ మందిరం వెనుక బుదవారం తనిఖీలు నిర్వహించారు. నాగారం 80 బీడి వర్కర్ కాలనీకి చెందిన సాజీద్ అలీని పట్టుకుని విచారించారు. అతని స్కూటిలో  1.110 కిలోల గంజాయి రవాణా చేస్తున్నట్టు గుర్తించి విచారించారు.అతనిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ హెచ్ఓ తెలిపారు. ఈ దాడిలో ఎక్సైజ్ ఎస్ ఐ టి.సుష్మిత, సిబ్బంది ప్రభాకర్, షబ్బీరుద్దీన్, దరి సింగ్ ,సునీల్, నిసార్ మియా పాల్గొన్నారు.

More articles

Latest article