నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ నగర్ లో సి ఎస్ సి ఆధార్ సేవ కేంద్రాన్ని మంగళవారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ ) ఎస్ . కిరణ్ కుమార్ ప్రారంభించారు . ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ …కామన్ సర్వీసు సెంటర్ ద్వారా నెలకొల్పబడిన సెంటర్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలనందించాలని సూచించారు . ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నిటికి ఆధార్ ముఖ్యమని ప్రజలు సైతం ఈ ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు . కార్యక్రమంలో నిజామాబాదు మున్సిపల్ కమిషనర్ మకరందు , ఆర్డీఓ రాజేంద్ర కుమార్ , తహసీల్దార్లు నాగార్జున ( నార్త్ ), బాలరాజు ( సౌత్ ), ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ కార్తిక్, CSC జిల్లా మేనేజర్ గౌతమ్ మ్యాకల పాల్గొన్నారు.

