నిజామాబాద్, బతుకమ్మ : సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. నగరంలోని కోటగల్లీలో గల జీహెచ్ఎస్ పాఠశాలలో మంగళవారం ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మార్చి 2025 లో నిర్వహించే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కరీంనగర్ స్థానం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లు సేవాలా నాయక్, సాయి రెడ్డి, అర్ వి ఎం గౌడ్, జెంసింగ్, ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు కృపాల్ సింగ్, వెనిగళ్ళ సురేష్, ఉపాధ్యాయ బృందం బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
