నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
గిరిరాజ్ కళాశాలకు కేటాయించబడిన 1860 సీట్లకు గాను, సోమవారం నాటికి 810 మంది విద్యార్థులు తుది ప్రవేశం పొందారని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్ మోహన్ రెడ్డి తెలిపారు. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఇప్పటివరకు వివిధ కోర్సులలో చేరిన వివరాలు ప్రిన్సిపాల్ తెలియజేశారు. బి.ఏ. తె.మీ.25, ఉర్దూ మీడియం 48, రెగ్యులర్ 121, రిస్ట్రక్చర్ పబ్లిక్ పాలసీ, గవర్నెన్స్ లో 20 మొత్తం బి.ఏ.లో 480 కి గాను, 214 విద్యార్థులు చేరారన్నారు. ఉపాధి ఆధారిత (ఏఈడీపీ) కోర్సులు బీకాం విభాగంలో బీ.ఎఫ్.ఎస్.ఐ. 23, సైన్స్ విభాగంలో హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ 13, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కోర్సుల్లో 25, ఈ మూడు (ఏఈడీపీ) కోర్సుల్లో మొత్తం 180 సీట్లకు గాను 62 మంది విద్యార్థులు చేరారన్నారు. బి.కాం.లో సి.ఏ.109, ఫినాన్స్ 29, టాక్సేషన్ 28, అనాలైటిక్స్23, బి.సి.ఏ. 28, బి.బి.ఏ.26, మొత్తం 480 కి గాను 243 విద్యార్థులు చేరారన్నారు. బీఎస్సీ లైఫ్ సైన్స్ లో 112, ఫిజికల్ సైన్స్ 152, హానర్స్ 26, మొత్తం బీఎస్సీలో 720 గాను 290 విద్యార్థుల అడ్మిషన్ సోమవారం నాటికి పూర్తి అయ్యాయన్నారు. జులై 4 వ తేదీ వరకు అడ్మిషన్స్ జరుగుతాయని, ఒరిజినల్ సరిటిఫికేట్స్ తో పాటు, జిరాక్స్ కాపీలు తీసుకొని రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎస్ రంగరత్నం, అడ్మిషన్ కన్వీనర్లు రమేష్ గౌడ్, రామస్వామి, దండు స్వామి, వినయ్ కుమార్, రంజిత, ఉమాకిరణ్, జయ ప్రసాద్, నహీదా బేగం, రాజేశ్, రామక్రిష్ణ, కిరణ్ కుమార్ గౌడ్, అధ్యాపకులు, సాంకేతిక సహాయకులు శ్రీకాంత్, నాగరాజు, మోబినొద్దీన్, గంగాధర్, విజయ, వివేకానంద, రాము, నరేష్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
