రుద్రూర్, బతుకమ్మ :
ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని రుద్రూర్ మండల కేంద్రంలో చెరువు కట్ట వద్ద గల గంగమ్మ తల్లి ఆలయంలో సోమవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు పండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, బోయి సంఘం కులస్తులు తదితరులు పాల్గొన్నారు.
