. . . రూ.11,100, 8 మొబైల్ ఫోన్ లు, 9 మోటార్ సైకిళ్లు స్వాధీనం
నందిపేట్, బతుకమ్మ :
నందిపేట్ మండల పరిధిలోని వెల్మల్ గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నందిపేట్ ఎస్ఐ కె. వినయ్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా 10 మంది వ్యక్తులు పేకాట ఆడుతుండగా, పోలీసులను గమనించిన ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. మిగిలిన ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.11,100 నగదు, 8 మొబైల్ ఫోన్లు, 9 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నేరస్తులను పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు.
