. . . ఎస్సై దీపక్ కుమార్
లింగంపేట్, బతుకమ్మ :
గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంకుల వివరాలు ఓటీపీ వివరాలు వెల్లడించవద్దని లింగంపేట ఎస్సై దీపక్ కుమార్ సూచించారు. గురువారం లింగంపేట మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై దీపక్ కుమార్ మాట్లాడుతూ సైబర్ నేరాలతో మోసపోతే టోల్ 1930 కాల్ చేయాలనీ సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు బ్యాంక్ అధికారుల పేరిట పోలీసుల పేరిట ఓటీపీలు అడిగితే వివరాలు వెల్లడించవద్దన్నారు. బ్యాంకు ఆఫీసర్లు గాని పోలీస్ ఆఫీసర్లు గాని ఓటీపీలు చెప్పమని అడగరు అన్నారు. అత్యవసర సమయంలో డయల్ 100/112 కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్స్ రామంచ తిరుపతి శేషరావు పిసిలు ప్రభాకర్ సాయిలు మాటలు పాటలు ద్వారా బ్యాంకులో ఖాతాదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి షి టీమ్ సభ్యులు శ్రీశైలం, సుప్రజ, బ్యాంక్ మేనేజర్ డి.జ్యోతి బ్యాంక్ సిబ్బందితో పాటు బ్యాంకు ఖాతాదారులు పాల్గొన్నారు .

