27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్టు

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ మండలంలోని కొయ్యగుట్ట తండా శివారులో పేకాట స్థావరంపై పోలీసులు సోమవారం దాడి చేసి పేకాట ఆడుతున్న ఏడుగురిని పట్టుకుని వారి వద్ద నుంచి నగదు, సెల్ ఫోన్ లు, బైక్ లను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ శ్రీధర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామశివారులో 10వ నెంబర్ కెనాల్ పక్కన కొందరు పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పేకాట స్థావరంపై తమ సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న రాజారం దుబ్బ, తాడ్కోల్ గ్రామాలకు చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.18,020లు, నాలుగు బైక్, ఏడు సెల్ ఫోన్ లు, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

More articles

Latest article