. . . తెలంగాణ విద్యార్ధి పరిషత్ జిల్లా అధ్యక్షులు కళ్యాణ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షులు కళ్యాణ్ అన్నారు. మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి నీటితో అభిషేకం చేసి, పూలమాలలు సమర్పించి, పుష్పాంజలి ఘటిస్తూ తెలంగాణ ఉద్యమ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వారి అశేష త్యాగాలు, పోరాటాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని యువత ముందుకు తీసుకెళ్లాలని, అమరవీరుల ఆశయాల సాధనకు కట్టుబడి పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు హరీష్, సిద్ధు, ప్రవీణ్, అనుష్ తదితరులు పాల్గొన్నారు.
