23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

బాన్సువాడలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పట్టణంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే పోచారం, మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ కాసుల విజయ, పోలీస్ స్టేషన్లో పట్టణ సీఐ తుల శ్రీధర్, రూరల్ సీఐ తిరుపతయ్య, బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు కొనాల గంగారెడ్డి, బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, అమరవీరుల స్థూపం వద్ద ఉద్యమకారులు, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఎక్సైజ్ సీఐ దిలీప్ కుమార్, మండల రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్ జెండాను ఎగరవేశారు.

 

Telangana Formation Day celebrations in Banswada

 

మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు, ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాలను ఎగురవేశారు.

 

Telangana Formation Day celebrations in Banswada

 

ఈ సందర్భంగా కొయ్యాగుట్ట చౌరస్తాలో ఉన్న అమరవీరుల స్థూపానికి, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు అంటూ చేసిన నినాదాలతో చౌరస్తా మార్మోగింది.

 

Telangana Formation Day celebrations in Banswada

More articles

Latest article