25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

జూన్ 2 న పిఆర్ సి ప్రకటించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న నూతన పిఆర్సి ప్రకటించాలని పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలోని ఆర్థిక, ఆర్థికేతర హామీలన్నింటిని అమలు చేసి ప్రజా పాలన సత్తా చాటాలని ఆయన సూచించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందడంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తే ప్రభుత్వంపై ప్రజల్లో, ఉద్యోగుల్లో నమ్మకం దెబ్బతింటుందని హెచ్చరించారు. ప్రజల సంక్షేమంతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమాన్ని సమానంగా పరిగణించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా డీఏలు, పెన్షనర్ల బెనిఫిట్స్, పాత పెన్షన్ విధానం అమలు, హెల్త్ కార్డులు, పెండింగ్ బిల్లుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల తరపున జూలై 1, 2023 నుండి అమలులోకి వచ్చేలా నూతన పిఆర్సిని జూన్ 2న ప్రకటించాలని కృపాల్ సింగ్ సోడి ప్రభుత్వాన్ని కోరారు.

More articles

Latest article