26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కాంగ్రెస్ పార్టీలో చేరిన బంజారా సేవాదళ్ మండల అధ్యక్షుడు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన దేవీదాస్

 

లింగంపేట్, బతుకమ్మ :

 

లింగంపేట్ మండలం నల్లమడుగు గ్రామానికి చెందిన బంజారా సేవాదళ్ మండల అధ్యక్షుడు దేవీదాస్ గారు, పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ శుక్రవారం పార్టీ కండువా కప్పి వారిని కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా దేవీదాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న తీరుకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

 

More articles

Latest article