. . . ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి జిల్లా చైర్మన్ డా.నీలి రామచందర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
రెడ్ క్రాస్ దినోత్సవం, తలసేమియా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న నిర్వహించే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి జిల్లా చైర్మన్ డా.నీలి రామచందర్ అన్నారు. రెడ్ క్రాస్ దినోత్సవంపై బుధవారం బాల్ భవన్ లో చిత్ర లేఖనం, వ్యాస రచన పోటిలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు రెడ్ క్రాస్ భవన్ హాల్ లో హెన్రీ డునంట్ చిత్రపటానికి పూలమాల కార్యక్రమం, అలాగే స్వచ్చంద రక్తదాన శిబిరం ఉంటుందన్నారు. అనంతరం ఉదయం 10:30 నిమిషాలకు బాల్ భవన్ లో బుధవారం నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాస రచన పోటిల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల అందజేస్తామన్నారు. అనంతరం ఉదయం 11:30 నిమిషాలకు తలసేమియా పిల్లలకు పండ్ల పంపిణి నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాలకు రెడ్ క్రాస్ ఈ.సి, ఎం.సి, డివిజన్ స్థాయి, మండల స్థాయి, నిజామాబాద్ అర్బన్, పాట్రన్స్ సభ్యులు సకాలంలో హాజరై విజయవంతం చేయాలని ఆయనన్నారు.
