. . . జయశంకర్ భూపాల పల్లి జిల్లాకు చేరిన సీఎం రేవంత్
జయశంకర్ భూపాలపల్లి, బతుకమ్మ :
కాళేశ్వరంలోని ప్రసిద్థ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జయశంకర్ భూపాల జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం కాళేశ్వరంకు హెలికాప్టర్ ద్వార చెరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు శ్రీధర్ బాబు, పోన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మన్ లు, వివేక్ వేంకట స్వామీలు స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి లతో పాటు ఇతర మంత్రులకు ఆలయ పూజారులు పుర్ణకుంభం తో స్వాగతం ఫలికారు.

ఈ సంధర్బంగా ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాధాలను అందచేశారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనుల పరిశీలనకు సీఎం రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఆలయంలో పూజల ఆనంతరం రూ.200 కోట్లతో కాళేశ్వర ఆలయం రాతి నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. మానేరు నధిపై 230 కోట్లతో హై లేవల్ బ్రిడ్జీ పనులకు శంకు స్థాపన చేయనున్నారు. ఆనంతరం నస్తూర్ పల్లిలో రైతు భరోసా నిధుల విడుధల చేసి సీయం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం పర్యటనలో భాగంగా పోలిస్ శాఖ భారీ బందోబస్థు ఏర్పాటు చేసింది.

