28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

అవకాశాన్ని వృధా చేసుకోవద్దు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఏబీవీపీ ఉచిత ఎప్ సెట్ కోచింగ్ ని సందర్శంచిన వీసీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఉచిత ఎప్ సెట్ కోచింగ్ అనేది సువర్ణ అవకాశమని, ఈ అవకాశాన్ని వృధా చేసుకోకుండా విద్యార్థులు మంచి ర్యాంకులను సాధించాలని తెలంగాణ విశ్వ విద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ యాదగిరి రావు అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు జిల్లా ఆధ్వర్యంలో నగరంలోని కవిత కాంప్లెక్స్ లోని ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో ఉచితంగా నిర్వహిస్తున్న ఎప్ సెట్ కోచింగ్ సెంటర్ ని ఆయన సోమవారం సందర్శించారు.

 

Don't waste the opportunity.

 

ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి మంచి ర్యాంకులను సాధించి తల్లిదండ్రులకు, కోచింగ్ నిర్వహిస్తున్న సంస్థకి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. అదే విధంగా చదువుతో పాటు, ఫిజికల్ ఫిట్ నెస్ స్కిల్స్ డెవలప్ మెంట్ చేసుకోవాలని తెలిపారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థుల శ్రేయస్సు కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని, రానున్న రోజుల్లో మరిన్ని రంగాలలో పనిచేసే విధంగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ మారయ్య గౌడ్, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు హర్షవర్ధన్, స్టేట్ యూనివర్సిటీస్ కన్వీనర్ బి.శివ, ఇందూరు జిల్లా కన్వీనర్ అక్షయ్, విభాగ్ కార్యాలయ కార్యదర్శి దుర్గా దాస్, విభాగ్ ఎస్ ఎఫ్ డి కన్వీనర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article