24.7 C
Hyderabad
Monday, August 3, 2026

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్​కు ఘన నివాళులు

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణ కేంద్రంలోని బస్టాండ్ వద్ద అంబేడ్కర్​ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కొండల గంగారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయడం వల్ల ఈరోజు పేద మధ్యతరగతి న్యాయం జరుగుతుందని అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక అవలంబించాలని ఆయన అడుగుజాడలో నడవాలని యువత అంబేద్కర్ కు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చిదుర సాయిలు, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, బిజెపి మున్సిపల్ కౌన్సిలర్ గజ్జల మహేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉమేష్, నాయకులు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, చీకట్ల రాజు, కొండని గంగారం, చంద్రశేఖర్ గౌడ్,శంకర్ లక్ష్మి మమత, భూమేష్ సాయి రెడ్డి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article