27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాసంగి వరి కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, ఏఎంసి చైర్మన్ కులకర్ణి సురేష్ బాబా చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రభుత్వం నిర్ణయించిన గ్రేడ్ ఏ రకానికి రూ.2380, కామన్ రకానికి రూ.2369 ధర నిర్ణయించిన ప్రకారం రైతులందరూ నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నిస్సార్, ఏఎంసీ డైరెక్టర్లు, మండల సమాఖ్య అధ్యక్షురాలు ద్రౌపతి, గ్రామ సంఘం అధ్యక్షురాలు ప్రేమల, ఏపిఎం బసవంతరావు, సిసి గంగారం, సిఏలు లావణ్య, స్వరూప, కమల, సాయిబాబా, గ్రామ రైతులు పాల్గొన్నారు.

More articles

Latest article