వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాసంగి వరి కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, ఏఎంసి చైర్మన్ కులకర్ణి సురేష్ బాబా చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రభుత్వం నిర్ణయించిన గ్రేడ్ ఏ రకానికి రూ.2380, కామన్ రకానికి రూ.2369 ధర నిర్ణయించిన ప్రకారం రైతులందరూ నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నిస్సార్, ఏఎంసీ...