25.7 C
Hyderabad

గాయని ఆశా బోస్లే కన్నుమూత

Must read

📰 Generate e-Paper Clip

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

ప్రముఖ గాయకురాలు ఆశా బోస్లే కన్నుమూశారు. దేశంలో తన గాత్రంతో ఓక ఉపు ఉపిన ఆశా బోస్లే ఆదివారం ముంబాయిలో తుది శ్వాస విడిచారు. ఆమె 1933లో మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించారు. ఆశా ఆశా బోస్లే ప్రముఖ గాయని లతా మంగేశ్కర్ సోదరి. గాయనిగా సుదీర్ఘ ప్రయాణం ఆమెది. ఎన్నో వేల పాటలు పాడారు. ఆమె కృషికి గానూ పద్మ విభూషణ్‌, దాదాసాహెబ్‌ ఫాల్కే,  మహారాష్ట్ర భూషణ్‌,  బంగా బిభూషన్‌ అవార్డులు వరించాయి. ఆశా సినీ ప్రస్థానం 1943 లో మరాఠీ చిత్రం మజాబ్‌తో ప్రారంభమైంది. అందులో  చలా చలా నవ్‌ చలా  పాట పాడారు. 1948లో బాలీవుడ్‌ దర్శకుడు హంసరాజ్‌ బహల్‌ పిలుపుతో ముంబయి వెళ్లారు. 1954లో వచ్చిన బూట్‌ పాలిష్‌ లోని పాటలతో ఆశాకు మంచి గుర్తింపు దక్కింది. దమ్‌ మారో దమ్‌,  చురా లియా హై, తుమ్నే జో దిల్‌ కో తదితర పాటలు సంచలనం సృష్టించాయి. తెలుగు సినిమాల్లో ఆశా బోస్లే పాడింది తక్కువ పాటలే అయినా దేనికదే ప్రత్యేకం. 80ల నుంచి 2007 వరకూ తెలుగులో పాడారు. ఇది మౌనగీతం (పాలు నీళ్లు),  సీతాకాలం ప్రేమకు (అశ్వమేథం), ఐసా లకిడి  (పవిత్ర బంధం),  నాలో ఊహలకు (చందమామ) తదితర పాటలతో ఆమె అలరించారు. తన సోదరి,  ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ వ్యక్తిగత కార్యదర్శి గణపతిరావును పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లకు విడాకులు తీసుకున్నారు. 1980లో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్డీ బర్మన్‌ను వివాహమాడారు. 1994లో ఆయన మరణించడంతో.. అప్పటి నుంచి తన ముగ్గురు పిల్లలు,  మనవడు,  మనవరాలే లోకంగా జీవితం గడిపారు. ఆశా బోస్లే ఆకస్మిక మరణానికి బాలివుడ్ కన్నీటి పర్యంతమైంది. ఆశా సోదరి లతా మంగేష్కర్ 2022 లో చనిపోగా నాలుగు సంవత్సరాలకే  ఆమె మరణం సిని జగత్తులో తీవ్ర విశాదం నింపింది. ఆశా బోస్లే మరణం పట్ల రాష్ట్రపతి ధ్రౌపది మూర్ము, ప్రధాని మోడితో పాటు సిని ప్రముఖులు, గాయకులు, సంగీత ప్రియులు సంతాపం తెలియచేశారు.

 

Singer Asha Bhosle passes away

More articles

Latest article