నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ప్లోర్ లీడర్ గా నాల్గవ డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని ప్రమోద్ కుమార్ నియమితులయ్యారు. ఇటీవల జరిగిన బల్ధియా ఎన్నికల్లో రెండవసారి ప్రమోద్ కుమార్ కార్పొరేటర్ గా ఎన్నిక కావడంతో ఆయనకు ఫ్లోర్ లీడర్ గా నియమిస్తూ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా దంపల్లి జ్యోతి, ఫ్లోర్ సెక్రటరిగా మఠం పవన్ కుమార్, పార్టీ విప్ గా న్యాలం సునీతలను నియమించారు. ఫ్లోర్ లీడర్ ప్రమోద్, పార్టీ విప్ న్యాలం సునీతలు రెండుసార్లు కార్పొరేటర్లుగా బీజేపీ తరపున ఎన్నికయ్యారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దంపల్లి జ్యోతి తొలిసారి ఎస్సీ రిజర్వేషన్ కోటాలో కార్పొరేటర్ గా కాగా, మఠం పవన్ కూడా తొలిసారి కార్పొరేటర్ అయ్యారు. గత బల్ధియా ఎన్నికల్లో 28 స్థానాలను గెలుచుకున్నప్పటికీ మేయర్ స్థానం దక్కకపోవడంతో అవినీతి రహిత పాలన అందిస్తామని అందుకు ప్రతిపక్ష పాత్ర పోశిస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే ఈ నెల 28న మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీజేపీ మున్పిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్, ఇతర పదవులను భర్తీ చేశారు.

