ఎడపల్లి, బతుకమ్మ :
ఎడపల్లి మండలంలోని ఏ ఆర్ పి క్యాంప్ గ్రామంలో శుక్రవారం శ్రీ రామనవమి ని పురస్కరించుకుని సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణతో వేలాది మంది భక్తుల మద్య సీతా రామ కళ్యాణాన్ని నిర్వహించారు. ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ కళ్యాణ మహోత్సవానికి చుటు ప్రక్కల గ్రామాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు హాజరై కళ్యాణాన్ని కనులారా వీక్షించి సీతా రాముల ఆశీస్సులు అందుకున్నారు.

వేద పండితులు కృష్ణ దేశ్ పాండే, మహరాజ్ వేదశ్రీ రాజశేఖర్ జోషి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కళ్యాణ మహోత్సవానికి తోట మధుసూదన్ దంపతులు, బాబురావు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కళ్యాణ మహోత్సవ అనంతరం అన్నదానం, కోలాటం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ అధ్యక్షులు సారా శ్రీనివాస్, ఉపాధ్యక్షులు తోట రాజశేఖర్, గ్రామ సర్పంచ్ పురమళ్ళ వినోద్, కార్యదర్శి పుల్కా స్వామి, కోశాధికారి రివ్వురి విటల్, శ్రీనివాస్ గౌడ్, రాంగోపాల్, కొమురయ్య, టి రాజు, బలరాం, బీఆర్ఎస్ సీను, వార్డు సభ్యులు వెంకటేష్, రంజిత్, కన్నా రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
