కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బడా కసాఫ్ గల్లి రైల్వే ట్రాక్ పిల్లర్ పై గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఒక గుర్తు తెలియని మృత దేహం లభ్యమైందని రైల్వే ఎస్సై సాదు లింబాద్రి తెలిపారు. మృత దేహాన్ని పరిశీలించిన తర్వాత అతని వయసు సుమారు 50 నుంచి 55 మద్య ఉండవచ్చని, అతని వద్ద ఎలాంటి ఐడీ ప్రూఫ్ లభ్యం కాలేదని పేర్కొన్నారు. గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపాడు. అనంతరం మృత దేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మృత దేహం గురించి ఎవరికైనా సమాచారం తెలిసినచో 8712658614 నెంబర్ ని సంప్రదించాలని కోరారు.

