. . . విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట
. . . మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :
ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి రెండింటిని సమన్వయం చేస్తూ..ప్రజలకు మెరుగైన పాలన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ అసెంబ్లీ లో ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మాత్యులు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ అని ఆయన పునరుద్ఘాటించారు. బుధవారం డిచ్ పల్లి మండలం సుద్దులం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే బడ్జెట్ పై విలేకరులతో మాట్లాడతూ రూ.3,24,234 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారికి సముచిత ప్రాధాన్యం ఇస్తుందని.. విద్య,వైద్యం, వ్యవసాయానికి ఈ బడ్జెట్ పెద్దపీట వేసిందన్నారు. ఈ సమావేశంలో ఏఎంసి చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డిచ్ పల్లి పార్టీ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, నాయకులు పొలసాని శ్రీనివాస్, వాసు బాబు, రాంచందర్ గౌడ్, శ్యామ్ సన్, ధర్మగౌడ్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
