భిక్కనూరు, బతుకమ్మ :
పార్టీలకు అతీతంగా అభివృద్ధికి సహకరించాలని భిక్కనూరు మండలం అంతంపల్లి సర్పంచ్ వలకొండ మంజుల అన్నారు. మంగళవారం జిపి ప్రాంగణంలో నిర్వహించిన తొలి గ్రామ సభకు ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రానున్న వేసవికాలం దృశ్యా తాగు నీటి సమస్య పరిష్కరించడానికి ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు. అన్ని అంశాలలో అంతంపల్లి గ్రామం ముందంజలో ఉండాలని గ్రామ అధికారులు గ్రామ ప్రజలు సహకారంతో అంతంపల్లిని జిల్లాలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఉన్నారు.

