28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరికి జైలుశిక్షలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రెండు వేర్వేరు కేసులలో తీర్పులు చెప్పిన మహిళ కోర్టు స్పెషల్ సెషన్స్ జడ్జి దుర్గా ప్రసాద్

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపులకు దాడులకు ప్రయత్నించిన ఇద్దరు పురుషులకు రెండు వేర్వేరు క్రిమినల్ కేసులలో తీర్పులు చెప్పిన మహిళలపై అత్యాచారాల కేసుల విచారణ న్యాయస్థానం నిజామాబాద్ స్పెషల్ సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్. నిజామాబాద్ నగర ఆరవ పోలీస్ స్టేషన్ పరిధిలో 8 నెలల గర్భవతిపై లైంగిక దాడికి ప్రయత్నించిన యెడ్ల అరుణ్ కుమార్ కు ఒక నేరంలో నాలుగు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష  మరొక సెక్షన్ లో రెండు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష, భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూప్లా తాండా వాసి గుగ్లోత్ సీతారామ్ కు రెండు సంవత్సరాల సాధారణ జైలుశిక్ష విదించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ తెలిపిన వివరాలు. ఎడపల్లి మండలం అంబం -వై గ్రామానికి చెందిన యెడ్ల అరుణ్ కుమార్ నిజామాబాద్ నగరంలోని ఆరవ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్సపల్లి లో ఒక ఇంటిలో ఉంటు ప్రయివేట్ పని చేసుకునే వాడు. 17 సెప్టెంబర్ 2024న తెల్లవారు జామున ఇంటిలో నిద్రిస్తున్న8 నెలలు గర్భవతిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడి నుండి పారిపోయాడు. పోలీసులు కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రం అదారంగా నిందితుడు అరుణ్ కు 4 సంవత్సరాల సాదారణ జైలుశిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా ఆరు నెలల జైలుశిక్ష అనుభవించాలని జడ్జి దుర్గా ప్రసాద్ తీర్పులో పేర్కొన్నారు. రెండు సంవత్సరాల సాదారణ జైలుశిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా ఆరు నెలల జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో వెల్లడించారు. రెండు శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.

. . . భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసులో

భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీంగల్ చెరువు దగ్గర గేదెలు మేపడానికి వెళ్లిన ఒక ఒంటరి మహిళపై గతంలో లైంగిక వేధింపులకు గురి చేసిన రూప్లా తాండాకు చెందిన గుగ్లోత్ సీతరామ్ తిరిగి 2 జనవరి 2025న ఆ మహిళపై మరోసారి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ  చేయి పట్టి లాగి మద్యం తాగమని బలవంతం చేసిన కేసులో రెండు సంవత్సరాల సాధారణ జైలుశిక్ష విదిస్తూ స్పెషల్ సెషన్స్ జడ్జి దుర్గా ప్రసాద్ తీర్పు వెల్లడించినట్లు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ తెలిపారు.

More articles

Latest article