. . . మహాసభల గోడపత్రుల ఆవిష్కరణ
. . . మహాసభల ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు మారయ్య గౌడ్
నిజామాబాద్, బతుకమ్మ:
అఖిల భారత విద్యార్ధి సమాఖ్య రాష్ట్ర మహాసభల గోడ ప్రతులను ఆహ్వాన సంఘం అధ్యక్షుడు మారయ్య గౌడ్ సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ఆర్ కళాశాలలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మారయ్య గౌడ్ మాట్లాడుతూ ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 18, 19, 20 తేదీలలో నిజామాబాద్ పట్టణంలో నిర్వహించడం సంతోషకరమన్నారు. దేశంలో మొట్టమొదటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని నేడు గత 90 సంవత్సరాలుగా విద్యార్థుల సమస్యల కోసం అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక సంఘం అన్నారు. విద్యను హక్కుగా సాధించేందుకు, విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాటాలకు దిశానిర్దేశం చేసే మహాసభలుగా ఇవి నిలవనున్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యావ్యతిరేక విధానాలపై చర్చించి పోరాటాలకు సన్నద్ధమవ్వడానికి రాష్ట్రంలో పెరుగుతున్న ఫీజులు, పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు, నిరుద్యోగ సమస్య, హాస్టల్ సౌకర్యాల లోపాలు, ప్రభుత్వ విద్యాసంస్థల నిర్లక్ష్యం వంటి అంశాలపై మహాసభల్లో సమగ్ర చర్చ జరగనుందన్నారు. విద్యా రంగాన్ని ప్రభుత్వం కాపాడటం కోసం విద్య రంగంలో సమూల మార్పులు తీసుకురావడం కోసం ఈ మహాసభలో ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు చర్చించిస్తారన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి 750 మంది విద్యార్ధి ప్రతినిధులు ఈ మహాసభలో పాల్గొని విజయవంతం చేయాలని మారయ్య గౌడ్ విద్యార్ధి లోకానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం అధ్యక్షులు సుధాకర్, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంజర భూమయ్య, ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుభోద్, రఘురాం జిల్లా సహాయ కార్యదర్శి కుశాల్, సంజయ్, ఉపాధ్యక్షుడు కార్తీక్, అనూష, నాయకులు కిషోర్, నిఖిల్, దినేష్, చందు తదితరులు పాల్గొన్నారు.
