29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

టెలికాం కాలనీలో రీడింగ్ రూం ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లా కేంద్ర గ్రంథాలయం నిజామాబాదుకు అనుబంధంగా ఆర్య నగర్ టెలికం కాలనీ చైతన్య వెల్ఫేర్ సొసైటీ భవనంలో శుక్రవారం రీడింగ్ రూమ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంత రెడ్డి రాజ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రీడింగ్ రూమ్ కు అవసరమైన భవన వసతి, ఫర్నిచర్ సౌకర్యం చైతన్య వెల్ఫేర్ సొసైటీ వారు ఏర్పాటు చేసినందుకు వారిని అభినందించారు. కాలనీలో గ్రంథాలయం ఏర్పాటు చేసుకునే ఆలోచన వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ గ్రంథాలయాభివృద్ధికి జిల్లా గ్రంధాలయ సంస్థ నుంచి పూర్తి సహకారం అందజేస్తానని అన్నారు. సొసైటీ భవనంలో టాయిలెట్ సౌకర్యం లేనందున సౌకర్యం కల్పించడానికి తన వంతు ఆర్థిక సహకారాన్ని సొసైటీ వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు పురాణం రమేష్, కార్యదర్శి జి. గంగాధర్, కోశాధికారి డి. పాండురంగం, సలహాదారులు నర్సింలు, కమలాకర్, ఆనంద రెడ్డి, సత్యనారాయణ స్వామి, బాలరాజు, సాయిలు, ప్రీతం, హన్మేందర్, దినేష్, రామాలయ సేవాసమితి అధ్యక్షులు ఎన్ గంగాధర్, కోశాధికారి సత్యనారాయణ స్వామి, జిల్లా కేంద్ర గ్రంథాలయం సహాయ గ్రంధ పాలకులు బి. తారకం హాజరైనారు.

 

Reading room opens in Telecom Colony

More articles

Latest article