29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

వామపక్ష ప్రజాస్వామ్య వాదులను గెలిపించండి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థులతో పాటు వామపక్ష ప్రజాతంత్ర వాదులను గెలిపించుకొని పట్టణాల అభివృద్ధికి సహకరించాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం సీపీఎం పార్టీ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టడం కొరకు బిజెపి ప్రయత్నం చేస్తుందని, ప్రజలు దీన్ని ఐక్యంగా తిప్పి కొట్టాలని, మతోన్మాదులకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టణాల అభివృద్ధి పైన దృష్టి పెట్టకుండా, ప్రజా సమస్యలను పరిష్కరించకుండా భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం సరైనది కాదన్నారు. సీపీఎం పార్టీ, వామపక్షాలు నిరంతరం ప్రజల హక్కుల కొరకు, వారి సంక్షేమం కొరకు అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించటం జరుగుతుందని, ప్రజా సమస్యలను ప్రక్కదోవ పట్టించడానికి చేసే కుటిల ప్రయత్నాలను ప్రజలు ఎదిరించినప్పుడే న్యాయం జరుగుతుందనన్నారు. ఒకవైపు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చి కార్పొరేట్ లకు, పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చడం తో పాటు గ్రామీణ పేదలకు ఉపాధి దూరం చేసే పద్ధతుల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తున్నారని, మరొకవైపు విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి పేదలకు అందుతున్న ఉచిత విద్యుత్తును దూరం చేయాలనుకుంటున్నారని, రైతులకు సకాలంలో విత్తనాలను, ఎరువులను అందించకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా పెన్షన్ల పెంపు, నిరుద్యోగ భృతి, కౌలుదారులకు రాయితీలు, ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయనన్నారు.  అందువల్ల రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై పోరాడే అభ్యర్థులను గెలిపించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు, కార్యదర్శివర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్, వెంకటేష్, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, కొండ గంగాధర్, విగ్నేష్, జంగం గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article