27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

డబుల్ బెడ్ రూంలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ :

 

జనతా గ్యారేజ్ ను వచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆశ నగర్ జీవన్ రెడ్డి ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో గల 13వ వార్డులో డబుల్ బెడ్ రూంలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనతా గ్యారేజ్ లో భాగంగా డబుల్ బెడ్ రూం అర్హులు వచ్చి తమకు కంప్లైంట్ చేసినట్టుగా తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలోని ఇంటి నిర్మాణాలు పూర్తయి సున్నం వేయించి మరి రెడీగా ఉంచిన ఇండ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని ప్రశ్నించారు. వెంటనే లబ్ధిదారులకు అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో కేటాయించి గృహ ప్రవేశాలు వెంటనే జరిగేలా చూడాలని కోరారు. లేకపోతే కలెక్టర్ ఆఫీస్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్, సీనియర్ నాయకులు పూల సుధాకర్, సుంకరి రవి, మాజీ కోఆప్షన్ నెంబర్ అజీమ్, మైనారిటీ నాయకులు, యువజన నాయకులు పృథ్వి, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article