నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నగరంలోని 2వ టౌన్ పరిధిలోని ఐటిఐ కాలేజి గ్రౌండ్ వద్ద షేక్ అఫ్రోజ్ ఆలియాస్ రోడ్డ అఫ్రోజ్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై ముజాహిద్ ఆలీ తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు శుక్రవారం ఎస్సై సిబ్బందితో కలిసి దాడి చేసి అతన్ని పట్టుకున్నారు. అఫ్రోజ్ పై గతంలో వివిధ పోలీస్ స్టేషన్ లలో 13 గంజాయి కేసులు నమోదైనట్లు తెలిపారు. నాందేడ్ నుంచి గంజాయి తీసుకువచ్చి నిజామాబాద్ అమ్ముతున్నాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.
