29 C
Hyderabad
Monday, August 3, 2026

శ్రమజీవుల సాహిత్యం సాంస్కృతిక బహుముఖ ప్రజ్ఞశాలి ఆరెట్టి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

మల్లు స్వరాజ్యం ట్రస్ట్ లో ఆరెట్టి 14వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం నగరంలోని నాందేవ్ వాడలోని సీపీఎం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆరెట్టి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళర్పించారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు సిర్ప లింగం మాట్లాడుతూ ఆరెట్టి నిరంతరం ప్రజల కోసం సాంస్కృతి సాహిత్య నాటిక ప్రదర్శనలు, అలాగే జోగిని వ్యవస్థ పై, గుట్కా పై నాటికలు వేసి ప్రజా చైతన్యం కోసం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సాంస్కృతిక రూపాల్లో అర్థమయ్యే విధంగా ప్రజలకు ప్రదర్శింప చేసేవారన్నారు. ఆయన ఆశయాన్ని నెరవేర్చటం కోసం నిరంతరం సాంస్కృతిక సాహిత్య రంగాన్ని ముందుకు తీసుకువెళ్లడం కోసం కృషి చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో నిజామాబాద్ జిల్లాలో విస్తరంగా సాహితీ రంగాన్ని ముందుకు తీసుకుపోతామన్నారు. ఈ కార్యక్రమంలో అష్ట గంగాధర్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి నర్సారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సతీష్, రాధా కిషన్, చంద్రశేఖర్, సిఐటియు గౌరవ అధ్యక్షులు రమేష్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట రాములు, ఐద్వా జిల్లా కార్యదర్శికార్యదర్శి సుజాత, ఆరెట్టి సతీమణి సువర్ణ, కుటుంబ సభ్యులు కటారి రాములు, మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు గంగులు, కార్యదర్శి ఫెన్షనర్ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ ఈవి లక్ష్మీనారాయణ, కోయేటి నరసింహులు, అనసూయ, నల్వాల నరసయ్య తదితరులున్నారు.

More articles

Latest article