23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

మన సంప్రదాయాలకు నిలువెత్తు రూపమే హిందూ పండుగలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపమే హిందూ పండుగలని పల్నాటి కార్తీక్ అన్నారు. మకర సంక్రాంతి సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్నాటి కార్తీక్ కుమార్ 25వ డివిజన్ లో చిన్నారులందరికీ పతంగులు పంచడం జరిగింది. ఆయన మాట్లాడుతూ రైతులందరు సంతోషంగా భోగి, సంక్రాతి, కనుమ గా మూడు రోజులు చిన్న, పెద్ద అందరు కలిసి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. సంక్రాతి అంటేనే చిన్న, పెద్ద తేడా లేకుండా పతంగులు ఎగరావేస్తారని, ముఖ్యంగా పతంగులు ఎగురవేసే సమయంలో విద్యుత్ తీగలు, రహదారులు, ఎత్తైన భవనాల సమీపంలో పతంగులు ఎగరేయకుండా ఉండాలని, ప్రమాదాలకు దారి తీసే చైనా మాంజ వాడకాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు. భద్రతే ప్రధాన లక్ష్యంగా పండుగను ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. చిన్నారులు అందరు కలిసి పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగదీష్, నిరంజన్, దినేష్, రాకేష్, నాని, మరియు చిన్నారులు పాల్గొన్నారు.

More articles

Latest article