30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు

Must read

📰 Generate e-Paper Clip

  • బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు

 

బాన్సువాడ, బతుకమ్మ  :  బాన్సువాడ పట్టణ కేంద్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విజయోత్సవ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, కామారెడ్డి జిల్లా డీసిసి కైలాస్ శ్రీనివాస్ నేతృతంలో  అంబేద్కర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్  చిత్రపటకానికి పాలాభిషేకం చేస్తూ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్బంగా రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అనుక్షణం ప్రజల కోసమే పని చేస్తున్నారని అన్నారు. చెప్పిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేరుస్తూ ముందుకు సాగుతున్న విషయాన్ని గమనించి జూబ్లీహిల్స్ ప్రజలు నవీన్ యాదవ్ ని సుమారు 25 వేల మెజారిటీతో గెలిపించుకున్నారని తెలిపారు. అక్కడే ఉంటూ కష్టపడిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Congress wins Jubilee Hills by-election

More articles

Latest article