బాన్సువాడ, బతుకమ్మ : బాలాల దినోత్సవ సందర్బంగా స్పార్క్ మైండ్స్ పాఠశాలలో విద్యార్థులు ఉత్సాహంగా నృత్యాలు, పాటలు, ఉపన్యాసాలలో పాల్గొన్నారు. పాఠశాల యాజమాన్యం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పాశం రాజిరెడ్డి, పాఠశాల యాజమాన్యం వేణు, గణేష్, కిరణ్, అరుణ్, గురునాథ్ తల్లి-తండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
