నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు కాకతీయ మహిళా జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఎన్నికైనట్లు శుక్రవారం పాఠశాల వాలీబాల్ కోచ్ సూరజ్ తెలిపారు. ఈనెల 18 నుంచి 20 వరకు సంగారెడ్డి జిల్లా సదాశివపేట లో జరుగుతున్న 69వ రాష్ట్రస్థాయి అండర్ 19 వాలీబాల్ పోటీలకు కాకతీయ మహిళా జూనియర్ కాలేజ్ విద్యార్థినులు శ్రీమయి, అమృత ప్రతినిత్యం వహించనున్నారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం రజినీకాంత్, తేజస్విని మేడం కళాశాల ప్రిన్సిపల్ సందీప్, కోఆర్డినేటర్ శ్రీలత , కళాశాల ఉపాధ్యాయుల బృందం వారిని అభినందించారు , విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించడం హర్షించదగ్గ విషయమన్నారు.
