27.3 C
Hyderabad

సాక్షి కార్యాలయం పై దాడులకు నిరసనగా ధర్నా

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణ కేంద్రంలోని అంబేడ్కర్  చౌరస్తా వద్ద శుక్రవారం బాన్సువాడ ప్రెస్ క్లబ్,  ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సాక్షి పై కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని వాస్తవాలు రాస్తున్న పత్రిక గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. సాక్షి ఎడిటర్ తో సహా జర్నలిస్టులను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలను కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సుధాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్,  సీపీఎం, సీపీఐ,  బీఆర్ఎస్ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.

More articles

Latest article