30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

సమస్యలు పరిష్కరించాలని డీఈఓకు వినతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పాఠశాల విద్య, కేజీబీవీ పాఠశాలల సమస్యలు, 7 నెలలుగా పెట్టి క్యాష్/పి పి ఏ నిలుపుదల బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ పి.శంతన్ ఆధ్వర్యంలో గురువారం డీఈఓకు వినతి పత్రం అందజేశారు.  జిల్లాలో పేద బాలికల కొరకు డ్రాప్ అవుట్ నివారణ కొరకు 27 కేజీబీవి పాఠశాలలు నిర్వహించబడుచున్నవని తెలిపారు. ఈ పాఠశాలలలో కాంట్రాక్టు వేతనం పై పని చేసే కేజీబీవీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కృషి వల్ల పదవ తరగతిలో రెసిడెన్షియల్ పాఠశాలలకు దీటుగా ఉత్తమ ఫలితాలను గత దశాబ్దంగా సాధిస్తున్నాయన్నారు. పాఠశాలలలో సమస్యలను పరిష్కరించుకుంటూ  విద్యార్థులకు సి ఆర్ టి లకు సిబ్బందికి ఏ లోటు రానీయకుండా కేజీబీవీ లలో ఉత్తమ ఫలితాలకు స్పెషల్ ఆఫీసర్లు చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. కానీ  విద్యాశాఖ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల కేజీబీవీలు సమర్థవంతంగా నిర్వహించడంలో స్పెషలాఫీసర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు మానసిక వేదన గురవుతున్నారన్నారు. సూచిక 1 ప్రకారం పెట్టి క్యాష్ ను సంబంధిత ఎస్ఓలకు పి పి ఏ ద్వారా విడుదల చేయడానికి 2025 ఆగస్టు నెల వరకు గడువు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం మార్చ్ 2025 వరకు మాత్రమే పెట్టి క్యాష్/పి పి ఏ చెల్లింపులు  జరిపారని తెలిపారు. మరుసటి  నెల 2025 ఏప్రిల్ నుండి పెట్టి క్యాష్ /పి పి ఏ విడుదల విషయంలో స్పష్టమైన కారణాలు, ఆదేశాలు లేకుండా నిలిపివేయడంతో గత ఏడు నెలలుగా(2025 ఏప్రిల్ నుండి 2025 అక్టోబర్) స్పెషల్ ఆఫీసర్లు పాఠశాల నిర్వహణకు అత్యవసర ఖర్చులను సొంతంగా తమ జేబు నుండి భరించుకొనే దుస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యంగా ఎల్పిజి సిలిండర్లు కొనుగోలు భారం భరించడం,గత ఏడు నెలల కాలంలో పాఠశాల నిర్వహణకు ఎలక్ట్రిసిటీ  ప్లంబర్ రిపేర్లు మొదలైన ఖర్చులు సొంతంగా డబ్బులు భరించుకోవడం ఒక్కొక్క ఎస్ ఓ లు సుమారు లక్షన్నర నుండి రెండు లక్షల రూపాయల వరకు జేబు నుండి ఖర్చు పెట్టిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తమ ఆర్థిక సమస్యను పరిష్కారం కొరకు ఆయా సందర్భాలలో మీ దృష్టికి ఎస్ఓలు తెచ్చినప్పటికీ వారికి తగు న్యాయం జరగలేదు ఫలితంగా ఎస్ఓ లు  అప్పుల బారినపడి అప్పులు పుట్టక తెచ్చిన అప్పులు చెల్లించక చివరకు తమ మెడలోని బంగారు ఆభరణాలు, చివరకు మంగళసూత్రాన్ని అమ్ముకుని పాఠశాల నిర్వహణ ఖర్చులను భరిస్తున్నారనితెలిపారు. తెచ్చిన అప్పులు చెల్లించలేక ఎన్నో అవమానాలకు ఎస్ఓలు గురవుతున్నారన్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు అప్పులు చెల్లించలేక అవమానాలకు గురై జరగరాని దురదృష్టకర సంఘటనలు జరిగితే బాధ్యత వహించేది జిల్లా విద్యాశాఖనే అవుతుంది, ఇది అత్యంత దురదృష్టకరమని తెలిపారు.  గత ఏడు నెలలుగా ప్రతి నెల మొదటి వారంలో చెల్లించబడే పెట్టి క్యాష్/పి పి ఏ సంబంధిత అధికారులు విడుదల నిలిపివేయడంతో  కేజీబీవీ పాఠశాలల నిర్వహణ పట్ల ఎస్ ఓ లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల పై స్పందించి తగు సమగ్ర విచారణ జరిపి ఏడు నెలలుగా పెట్టి క్యాష్ /పి పి ఏ నిలుపుదలకు కారకులైన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, తక్షణమే కేజీబీవి  పాఠశాలల నిర్వహణలో ఎస్ ఓ లు ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆర్థికేతర  సమస్యను సానుభూతితో పరిష్కరించాలని, ఇప్పటివరకు ఎస్ఓలకు చెల్లించబడే బకాయి మొత్తాలను తక్షణమే చెల్లించాలని కోరారు.

More articles

Latest article