27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

14న రాష్ట్రవ్యాప్త బందును విజయవంతం చేయండి

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్,బతుకమ్మ: 42% రిజర్వేషన్ లపై హైకోర్ట్ స్టే పై నిరసనగా  ఈ నెల 14 న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బంద్ విజయవంతము చేయండని తెలంగాణ , బిసి ,సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి మూర్తి అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అన్ని రంగాల్లో , బిసి లను అణగ దోకుతూనే కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 5% లేని అగ్ర వర్ణల కోసం 10% రిజర్వేషన్ ఇవ్వడం, ఎకనామికల్ వర్కర్స్ సర్వీస్ ఇచ్చినప్పుడు  బిసి లు వ్యతిరేకించలే. ఓసి .లలో కూడ పేదరిక జనాభా ఉంది కదా అని  బిసి సంఘంలు ఏమి పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం 42% బిసి రిజర్వేషన్ ఇస్తారని శత విధాల ప్రయత్నం చేసి అగ్ర కులాలు ఓర్వలేక కడుపు మంటతో హైకోర్టుకు రెడ్డి జాగృతికి చెందిన మాధవ రెడ్డి అనే వ్యక్తి కోర్ట్ ను ఆశ్రయించడం జరిగింది. రెండు రోజుల వాదనలు విన్న తర్వాత స్టే ఇవ్వడం జరిగింది. అందుకు నిరసనగా ఈ నెల 14వ తేదిన అన్ని బీసీ సంఘ లు కలిసి రాష్ట్ర బంద్ కు పిలుపు ఇవ్వడం జరిగింది.విద్య సంస్థలు, వాణిజ్య సంస్థలు, కుల సంఘాలు అందరు స్వచ్ఛదంగా బంద్ లో పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు. బిసి ల హక్కులు మనం ఇపుడు సాదించుకోకుంటే తర్వాత కష్టం అవుతుంది. కాబట్టి కొన్ని రాజకీయ పార్టీలు చేసిన మోసానికి బలికాకుండా అందరు బంద్ లో పాల్గొనాలని పిలుపును ఇచ్చారు.

More articles

Latest article