29 C
Hyderabad
Monday, August 3, 2026

రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో మహాజనసభ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ: బిచ్కుంద : బిచ్కుంద సొసైటీలో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సొసైటీని అభివృద్ధి బాటలో తీసుకువెళ్లేందుకు సహకరించాలని సోసైటీ చైర్మన్ నాల్చర్ బాలాజీ రైతులను కోరారు. సోమవారం బిచ్కుంద  వ్యవసాయ సహకార సంఘం భవనంలో సొసైటీ చైర్మన్ నల్చర్ బాలాజీ అధ్యక్షతన మహాజన సభ నిర్వహించారు. ఈ సభలో సొసైటీ లావాదేవీలను రైతులకు చదివి వినిపించారు. 2025 సంవత్సరం సంబంధించి ఆరు మాసాల జమ ఖర్చుల పట్టికలను ఆమోదించారు. గత సంవత్సర ఆడిట్ అయిన అంశములను పరిశీలించి ఆమోదించారు. అనంతరం రైతుల కోరిక మేరకు  అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు ఎకరానికి 25,000 చొప్పున పంట నష్టం ఇవ్వాలని తీర్మానించారు. అలాగే ప్రతి వరి పంట వేసిన రైతుకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, ఎస్బిఐ బ్యాంక్ లోన్లు అధిక వడ్డీకి ఇస్తున్నందున డిసిసిబి బ్యాంకులో మెరిజ్ చేయాలని సంఘ పరిధిలో తీసుకున్న అప్పులకు సంఘం నందు వడ్డీ కంటిన్యూ చేసుకోవాలని తీర్మానించడం జరిగిందని సొసైటీ చైర్మన్ నల్చర్ బాలాజీ తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్, వైస్ చైర్మన్ యాదవ్ రావ్, సొసైటీ డైరెక్టర్లు ధర్పల్ సంజు, పోతుల అశోక్, సాయిని వినోద, శంకర్ నాయక్, అనిశెట్టి శివరాజ్, చంద్రకాంత్, గణపతి రెడ్డి, శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article